గరళము మింగిన శివునికి
నిదర్శనమై, నీ దర్శనం
సమాజమనే దేవాలయమున.
మననం చేసి సిద్దాంతాల జ్ఞానం,
ధ్యానం చేసి మనో నిబ్బరం,
స్నేహం చేసి కుల మత రహితం,
సాయం చేసి సమాజ హితం,
నువ్వు పెంచేవి నాలుగు మొక్కలైనా,
తుదకు పంచేవి పదిమందికి తీయని పళ్ళేగా...
గెలుపు ఓటముల లెక్కలేయక,
కులం గోడలు అడ్డుకట్టక,
కన్నబిడ్డలకే నాలుగు రాళ్ళు; వెనకేయక
అన్న-అయ్యకే ఎదురు, తప్పక
ఒంటరిగా నువ్వు నిలుచుంటే, మిన్నంటే నీ పిడికిలి...జై హింద్..అని జై కొడుతుంటే...