Saturday, November 30, 2013

శివా......

                                                

శివా......

నే కన్న కలలను కలంతో లిఖించా
నువు కనే కలలకు నేనే కలమై నిలిచా

నా జన్మకు బ్రహ్మయిన మా అమ్మకు నన్నే బొమ్మగా ఇచ్చి
ఈ బొమ్మతో నువ్వాడే నీ ఆటలో, నువ్వే బొమ్మయ్యావేమయ్యా

నలుగురూ నిను తలిచే నామంతో మా నాన్న నను పిలిచినా
నా నామంతోనే  నే నిను పిలిచా, నీ నామంతో కొంచెం నను పిలవవయా

అడగకనే నాకు అవయవాల ఆకృతిచ్చి, ఏ లోపం లేని రూపమిచ్చి
అపురూపమైన నీ  ప్రతిరూపానికి, ఆలయాన రూపమే లేదేమయ్యా

ముచ్చటగా మూడేళ్ళే అమ్మ పాలతో నా ఆకలి తీర్చి
మూడు కళ్ళ ఓ ముదుసలి, నువ్వింకా ఆవుపాల అభిషేకమే అడిగేవేమయ్యా

పుట్టగానే, నా నుదుటన తలరాతే నువ్వు రాసి
చావగానే, నా చితినే నీ నుదుటన విభూతి గీతే చేస్తావేమయ్యా