గుచ్చి గుచ్చి చూపులతో, వచ్చీరాని మీసాలతో
మచ్చే లేని అందాలతో, ఇచ్చి పుచ్చుకొనే ప్రేమలతో
పొంగే ప్రాయం, తీరని దాహం
ఆశల వేగం, ఎవరాపిన యుద్ధం
కక్షలు లేని స్నేహాలతో, కన్నులు మీటు సరసాలతో
ఎగసే పరువపు కెరటాలతో, పదహారులు చేరు తీరాలలో
పొంగే ప్రాయం, తీరని దాహం
ఆశల వేగం, ఎవరాపిన యుద్ధం
కొత్తగా కొమ్మన పూసినాం, సరికొత్తగా రేకులు విచ్చినాం
మెత్తగా జారే హిమబిందువలే, మేమే నేడు చేరుతాం
రేకులనే చేరి ముద్దాడినట్లే, పెదవులనే మేము తాకుతాం
తీయని తేనెను వెతుకుతాం, తుమ్మెదై పూవుని చేరుతాం
మనసులతోనే మఖరందాన్ని తాగి, పరిమలమే వెదజల్లుతాం
తనువులో పొంగే కన్నె అలలనే, ప్రేమతీరం చేర్చి సేదతీరుతాం