Saturday, November 24, 2012

నీ జ్ఞాపకాలలో



నీకై నీరెండలో వేచిన రోజులు 
నీడలా నీ వెంట నడచిన సంగతులు 
సుమించవ నా మదిలో తీగమల్లెలై 
వర్షించవా నీ రాకతో స్వాతిజల్లులై 

సుప్రభాతమే నేకానా 
నీ నుదుట సింధూరానికి 
స్వప్నలోకమే విడదీయునా 
నా మదిన ఉన్న నీ ప్రతిమని 

తొలకరి జల్లులా 
తొలిపొద్దులో ముదర ఎరుపులా 
సెలయేరులా 
అడ్డుగా నిలిచిన రాళ్ళల్లో రాగాలుగా 

గగన కడలిపై మేఘపు అలలుగా 
ఎల్లలులేని వెన్నెల మైమరపులా 

హరివిల్లులా 
అలికిన అరుగుల లోగిలి ముంగిళ్ళలా 
పసివయసులా 
సిరివెన్నెల నవ్వుల పసికందులా 

పడతి వేళ్ళను రాలే, చుక్కల ముగ్గులా 
ఎన్నులు వేసి వంగిన వరిపైరులా 

వీణలా 
మడులుగా దున్నే మాగాణిలా 
పారాణిలా 
వెదజల్లే మల్లెల సుమగంధంలా 

అలుపంటూ ఎరుగని, అమ్మ చేదోడులా 
నా పయనం గమ్యపు గుడిలో, దేవతలా