వెన్నెల వర్షంలో మల్లెల మంచం
మనసుల ముంగిట వరసైన బంధం
తెరచాటు ఆటలో తెల్లారే చిత్రం
బెదురు చూపులకు బదులే నిషిద్ధం
మనసైన రాజు మనువాడి వస్తే
మొరటు మీసాలే గిలిగింతలు పెడితే
గోరంత సరసం గాయాలే చేస్తే
వరస మారిందే కుంకుమ రేఖే
సరదా సాయంత్రం దాటి, రాత్రి పరదానే చేరాక
వరద గోదారల్లే పొంగి, మగడి సంద్రాన మునిగాక
ఒంటరైనది ఒంటరితనం
జామురేయికి జంట మనం
పంట కొచ్చిన యవ్వనం
ప్రధమ రేయికి మూలధనం
కనుల కవ్వింపులు దాటి, కన్నె కౌగిట చేరాక
పెదవి అంచున మొదలు, నడుము వంపున జారాక
చేతి గాజుల సుమస్వరం
తట్టి లేపెను నర నరం
ముడులు వేసిన జ్ఞాపకం
ఎదను జారెను ఈక్షణం