Thursday, December 5, 2013

పెనం పైన వేసే అట్టు, పేపర్ పైన వ్రాసేటట్టు


ఒట్టు, ఇది వట్టి అట్టు

వద్దనలేనట్టు 
పొద్దునే తినేట్టు
వహవా అనేట్టు
తెలవారే వేళలోన
తెలుగువారి పెనం పైన
పడి లేచిన ప్రతీ అట్టు  
నోటి లోన పడి కరిగేట్టు

ఆడవారి కనికట్టు
మగవారి పనిపట్టు
హోటల్లో తిన్నవారు, పన్నుకట్టు
ముసలివారు నమిలేట్టు
పడుచువారు పడిచచ్చేట్టు
ఉపవాసం ఉన్నవారు, బ్రతికేట్టు 
నీళ్ళు చల్లితే పెనం బుసలుకొట్టు
నూనె చల్లితే అట్టును ఒడిసిపట్టు
అల్లం ఉల్లితో పెసరట్టు
మధ్యలో ఉప్మ్నాతో సర్దేట్టు
ఆవిరి కుడుముగా మినపట్టు
ఆయిల్ లెస్-గా వండేట్టు  
కారం కుర్మాతో మసాలా అట్టు
కొత్తిమీర చట్నీతో నంచేట్టు 
బెల్లం పాకంతో అట్లతద్దె అట్టు
వాయినాల తాయినంలా పదిమందికి పంచేట్టు  

ఫలహారానికి పెసరట్టు
బలహారానికి మినపట్టు
కలహారానికి కారంఅట్టు
మానవహారానికి అట్లతద్దె అట్టు