Saturday, December 29, 2012

Journalism




జనారణ్యపు మృగాలనే వేటాడే క్రూరం
ఇజాలు మరచి నిజాలకోసం పోరాడే సైన్యం
బజారు గొడవలో బేజారు కాని ఆత్మ స్థైర్యం  
జవాబు కోసం నవాబుకే ఎదురు నిలిచే ధైర్యం
కులాల గొడవలో కలాన్ని వాడి నరికేసే రౌద్రం 
మతాల మధ్య అభిమతాల యుద్ధం ఆపే దైవం
గతాలు తవ్వి భుజాలకెత్తి బజారుకీడ్చే హీరో ఇజం
కితాబులడగక విధాతకొదలక ఎదురు నిలిచే శౌర్యం

జనాలకోసం జనాల నైజం జగానికి చెప్పేదే జర్నలిజం
జగాన అంతా జులాయిలా తిరిగే జవాబుదారీయే జర్నలిజం 
రుబాబు వేళ ఖరాబు మొత్తం ప్రసారం చేసేదే జర్నలిజం 
రాజకీయపు రంగుని చెరిపి ఖద్దరు తెలుపుని చూపేదే జర్నలిజం