నీ జన్మకి తన దేహమే గర్భాలయం
నీ దేహమే తన రక్తానికి ప్రతిరూపం
వేలుపట్టి నడకే నేర్పిన
వెన్నుతట్టి ముందుకు నడిపిన
పైట కొంగుతో కన్నీరే తుడిచిన
పైట చాటుతో కడుపు నింపిన
కమ్మని ప్రేమకు అమ్మ కౌగిలే లోగిలి
వెచ్చని నిదురకు అమ్మ ఒడిలో లాలి
నాన్న ప్రేమ కడుపులో దాచి
బ్రహ్మ సృష్టికి ఆద్యం పోసి
ఊహకందని రూపం కూర్చి
ఉదరమునే ఊయలగా చేసి
నిన్ను కన్న అమ్మేరా, గుడిలో వున్న బొమ్మ
నిస్వార్ధమైన ప్రేమేరా, అమ్మ అనే జన్మ
కన్నె సొగసు నివేదన చేసి
కడుపు తీపితో కావలి కాసి
నవమాసాలు నిన్నే మోసి
నినుకంటూ తను మళ్లీ పుట్టి
యుగాల చరితకు మూలంరా, అమ్మ అనే కరుణ
ఎదురు దెబ్బన అమ్మేరా, మొదట వచ్చే స్ఫురణ