మథనపడి మరచిపోలేను
ఎదురుపడి ప్రశ్నించలేను
నిను చేరలేననే నిజములో
మరణమనే బ్రతుకులో
శ్వాస పీల్చే ఆశ లేక
సేద తీరే చోటు లేక
శిలగా నిలువనా
శిధిలమైపోనా
గతము మరచి సాగలేను
గళము విప్పి చెప్పలేను
నిర్జీవమైన బ్రతుకులో
నిదుర రాని రేయిలో
మనసుకో తోడు లేక
మనిషిగా బ్రతకలేక
గరళమే మ్రింగనా
గాలిలో కలువనా