ఎవరూ రారుగా నీ తోడుగా ఓటమిలో
గెలుపే దూరమైన చీకటిలో, చితిమంటలలో
నిన్ను నువ్వుగా ప్రేరేపించుకో
రేపటి గెలుపుకై ఆశే పెంచుకో
కన్నీరే తుడుచుకో, కలతలనే మరచిపో
కసినే నింపుకో, కృషిగా మలచుకో
తగిలిన గాయం మానేలోగా
తీరం చేరే దారేదో ఎంచుకో
చుట్టూ నిండిన గాలిలో
ప్రాణం నిలిపే శ్వాసేదో తెలుసుకో
నిన్న చేదు చీకటిలో, నిదురపో హాయిగా
రేపు వచ్చే వేకువలో, మేలుకో త్వరగా
గుండెలో ధైర్యమే, దీపమై నడిపించగా
గొంతులో గెలుపు గేయమే, సాగనీ తీయగా
నీ ఆశే పెరగని, నిన్నటి హేళన గుర్తుంటే
నీ గుండెలో కసి రగలని, గాయాలే మానకుంటే