Saturday, November 24, 2012

కులమతముందా

పొద్దున్నే పూసే పూవుకు ఉందా
మధ్యాహ్నం చెట్టు నీడకు ఉందా
కష్టం చిందే చమట చుక్కల కుందా
గోవులు ఇచ్చే ఆ పాలకు ఉందా 
జాబిలికై చేతులుచాపే పసిపాపల మనస్సులో..........కులమతముందా

నిన్ను నన్ను మోసే ఈ మన్నుకు ఉందా
నిత్యం ఆగకసాగే ఈ కాలానికి ఉందా
నింగిని నేలను కలిపే వాన చినుకుకుందా
కధలే చెప్పే పేదరాసి పెద్దమ్మకుందా
తానె మండి వెలుగుని పంచె సూర్యుడి గుండెల్లో........కులమతముందా