Friday, November 23, 2012

నటిస్తూ జీవించు, మరణిస్తూ రోధించు



ఇంచ్ ఇంచ్ న నటించు, బ్రతుకు కంచెలో జీవిస్తూ
పదిమంది చెప్పే బూతైనా, శభాష్ అంటూ కీర్తించు 

మనసునున్న మురికినే, ప్లాస్టిక్ పూలతో పూజించు
ఇష్టంలేని కాపురమే, సెంటు పూసి సాగించు 


మచ్చ పడ్డ మొఖానికి, మేకప్ వేసి నడిపించు 
నల్లబడ్డ మనస్సునే, ముసుగు వేసి ముందుంచు 

వీధిరౌడి వోటడిగితే, నోటుకో వోటేసి నెగ్గించు
సొమ్ముకోసం సెక్స్ నే, అంగడి బొమ్మతో అమ్మించు

పక్కవాడు సాయం కోరితే, పనుందంటూ లాగించు 
ఆ పనేలేని రోజుంటే, మందు తాగి నిద్రించు 

మంచాన పడ్డ నాడు, మనస్సు పెట్టి ఆలోచిస్తే 
వెనక్కి తిరిగి చూసి, వెక్కి వెక్కి నువ్వేడ్చు 

జ్ఞాపకాలు జల్లెడపడితే, మంచిలేని నీ స్వార్ధం తోచు 
జబ్బుపడ్డ ఆ రోజు, వాటికోసం నువ్వు ఎదురుచూచు

కడకు చేరు వరకు, నీ కాళ్ళ మీద నువ్వు నిలుచు
ఆఖరి ప్రయాణం, నలుగురి భుజాలపైనె సాగించు 








నేడు నటిస్తూ జీవించు, రేపు మరణిస్తూ రోధించు