డిగ్రీ పట్టా చేతపట్టి
ఉద్యోగానికై తలుపుతట్టి
నో వేకెన్సి బోర్డుని విసిరికొట్టి
నింగినంటిన కోపాన్ని అణచిపెట్టి
ముందుకు సాగాను
మువ్వన్నెల జెండా రెపరెపలాడినా
దేసాన్నేలే నేతలు మాటిమాటికీ మారినా
చదివిన చదువుకు అర్ధం తెలియక
నిస్సహాయంగా నిలిచివున్నాను
తిరిగి ఇంటికి ఎలా వెళ్ళను?