Tuesday, November 27, 2012

Young Blood


డేగ కన్నుల యువకులం
గెలుపునెన్నడూ వదలబోం
వేకువకి సూర్యులమేమవ్వుతాం

శిల్పం దాగిన రాళ్ళుమేం
వెలితీస్తే జ్యోతిగా వెలుగుతాం
వేనోళ్ళ కీర్తిగా మేం నిలుచుతాం

రేప్పలో దాగిన స్వప్నాలు, రేపటికై ఆశలు
దిక్కులు దాటు వేగాలు, అందవా ఆ గగనాలు

నిత్యమూ పోరాడే మా లక్షణం
నింగినైనా దరికి చేర్చు ఈ క్షణం
నిప్పుకన్నా వేడిదైన మా గుండెతో
రాతినైనా పిండిచేయు మా కండతో

కడగళ్ళ కన్నీళ్ళే మాకు తెలియవే
కష్టాల నదులే ఎదురీదుతాములే
సాధించేదెంతోఉందని సాగుతాములే
సగౌర్వంగా విజయాన్నే చాటుతాములే

ఎక్కుపెట్టినా బాణాలం మేమందరం
గురిచూసి కొడితే లక్ష్యాలన్నీ చేదిస్తాం
తల్లితండ్రుల నీడల్లో ఎండే ఎరుగం
మా కాళ్ళమీద మేం నిలబడి తీరుతాం

మోసాలు చేసే గుణము మాకు లేదులే
ముక్కుసూటిగా పోయేతత్వం మాదేనులే
కన్నతల్లిని వదిలి పోలేములే
జన్మభూమిని విడిచే పాపం చేయబోములే