కన్నులు మాట్లాడడం మొదలెడితే
పెదవులు పోట్లాడడం ఆపేస్తాయి
మనసులు మొహమాటపడడం మానేస్తే
తనువులు తొందరపడడం మొదలెడతాయి
విరిసీ విరియని వయసులో
మనసు వేసే మొగ్గలు
రాతిరి కురిసే మంచులొ
రేకులపై జారే హిమబిందువులు
సాయంత్రం వేళలో ఏ సాహిత్యమున్నదో
కవ్వించి మనసుని కవిని చేస్తున్నది
వాకిట వెలుగుకి సిగ్గనిపించెనో ఏమో
మాపటి చీకటినే పరదాగా పరిచినది
అధరాల కలయిక బహుసా బలవంతమైనా
పరువాల కౌగిలి ఆపై మొహమాటపడునా
వద్దు అనే మాటలు హద్దులవుతున్నా
గీత దాటే ముద్దులు కన్నె శుభలేఖలవునా
నా హృదయమనే వరద గోదారిపై
నీ కన్నె కౌగిలి వన్నెలే వెన్నెలాయే
వేల విలువైన వలువలైనా
విడుదలయ్యే వేళకు, వంపు సొంపులపై వదులాయే