Wednesday, November 20, 2013

It's U

కన్నెపిల్ల చూపు ఎంత సుతిమెత్తనైనా
అది నన్ను తాకువేళ గుండె బద్ధలవునా
నన్ను వీడి సాగుతున్న తన నడకలైనా
తనువైపు నన్నులాగు ఆకర్షణలవునా
సూర్యుడు వెలుగుకై తిరిగే భూమికి
పగలు రేయి చాలునులే
నా నిశ్చలి నవ్వుకై తిరిగే నాకిక
వేకువ, వెన్నెల చాలవులే

వీణ మీటి డప్పు కొట్టి గెంతులేసినట్టు
ఏటి గట్టు మీద చెట్టు ఎక్కి దూకి నట్టు
పట్టు పట్టి కొత్త పాట నేర్చుకొన్నట్టు
ఉట్టి కొట్టి రంగు నీళ్ళు మీద జల్లుకున్నట్టు

పిచ్చి పిచ్చి ఊహలకే తన గుచ్చి గుచ్చి చూపులు కారణం
రచ్చ రచ్చ చేష్టలకే తన టచ్చ్ లిచ్చే చేతులు కారణం

తను తిన్న స్పూనుతోనే నేను తిన్నట్టు
ఒక్క డ్రింకు రెండు స్ట్రాలు పెట్టి గుటకలేసినట్టు
కోల్డ్ కాఫీ బాగా వేడి చేసి తాగినట్టు
ఇడ్లీ పిండితోనె పిజ్జా చేసి పంచిపెట్టినట్టు

అల్లి బిల్లి ఎంగిలికే తన కలివిడి మనసే కారణం
వింత వింత టేస్టులకే తను పక్కనున్నదని నిదర్శనం

వేల వేల వీణలన్ని ఒక్కసారి మీటినట్టు
ఆల్ అల్సేషియన్ డాగ్ లన్నీ ఒక్కసారి అరచినట్టు
ఆకతాయి పోరగాడు వేలుమడిచి విజిల్ కొట్టినట్టు
ఆంబులెన్స్ సైరనేమో ఆగి ఆగి మోగినట్టు

నా గుండెలోన డి.టి.స్ సౌండులకే తన క్యూటైన మ్యూట్ పెదవులు కారణం
నా గొంతులోనే ఆగిన మాటలకే తన మొహమాటపు మనసే కారణం 

అమ్మ తిట్టి నాన్న కొడితే మూతి ముడిచినట్టు
ఫెయిల్ అయితే ఫ్రెండు వచ్చి పార్టీ అడిగినట్టు
హాలీ డే నాడు ఎక్ స్ట్రా క్లాస్ కెళ్ళినట్టు
హోళీ డే నాడు కొత్త షర్ట్ పైన రంగు కొట్టినట్టు

నా డిప్రెషన్ మూడుకే తన హార్ష్ ఎక్స్ ప్రెషనే కారణం
కల్ల బొల్లి మాటలనే నమ్మి తను నన్ను తిడితే దారుణం