చాన్నాళ్ళుగా చాన్తాళ్ళులా సలహాలు
వింటూ కూర్చుంటే అవి నీకు ఉరితాళ్ళు
మాటలు రాని మనసొకటే చెపుతుంది నిజాలు
మౌనంగా కూర్చుంటే వినిపించే ఆ సత్యాలు
మొసేవాడికే తెలుసు బరువైనా బ్రతుకైనా
కూసేవాడికి తెలిసేనా ఆ బరువులో కాస్తైనా
వెతకడం మొదలెడితే వొళ్ళంతా కన్నాలే
కెలకడం మొదలెడితే కొట్టేది కంపేలే
ఘనాపాటీల పిచ్చాపాటీ
సలహాలు చెప్పడానికి పోటాపోటీ
అర్హత లేని అన్నయ్యలతో డిబేటు పోటీ
అక్కసుతో మాట్లాడే పెదవులతో పడగలవా పోటీ
విమర్శలను విస్మరించు వెటకారం వెక్కిరిస్తే
సద్విమర్శలను సత్కరించు సహకారం అందిస్తే
ఆత్మవిమర్శను స్వీకరించు మరోగెలుపుకు శ్రీకారం నువ్వు పెడితే
వింటూ కూర్చుంటే అవి నీకు ఉరితాళ్ళు
మాటలు రాని మనసొకటే చెపుతుంది నిజాలు
మౌనంగా కూర్చుంటే వినిపించే ఆ సత్యాలు
మొసేవాడికే తెలుసు బరువైనా బ్రతుకైనా
కూసేవాడికి తెలిసేనా ఆ బరువులో కాస్తైనా
వెతకడం మొదలెడితే వొళ్ళంతా కన్నాలే
కెలకడం మొదలెడితే కొట్టేది కంపేలే
ఘనాపాటీల పిచ్చాపాటీ
సలహాలు చెప్పడానికి పోటాపోటీ
అర్హత లేని అన్నయ్యలతో డిబేటు పోటీ
అక్కసుతో మాట్లాడే పెదవులతో పడగలవా పోటీ
విమర్శలను విస్మరించు వెటకారం వెక్కిరిస్తే
సద్విమర్శలను సత్కరించు సహకారం అందిస్తే
ఆత్మవిమర్శను స్వీకరించు మరోగెలుపుకు శ్రీకారం నువ్వు పెడితే