మనిషి చీకటిలో పడితే నిదురపోతాడు
మనిషికే చీకటి పడితే బెదిరిపోతాడు
బాధ బరువైనది, అందుకే
బ్రతుకు విలువైనది
సుఖం సులువైనది, అందుకే
గెలుపు అరుదైనది
కంటిని మూసే వీలే నిదుర
మరల తెరవలేక పోవడమే వ్యథరా
మింటిని తాకే ఆశే, పదరా.....!
మునుపటినే మొస్తూ పోతే పడిపోతావురా
మన్నులోపడి విత్తు మానవును
గాలిలోపడి మాను మంటవును
మంటలోపడి మట్టి కుండవును
కుండలోపడి నీళ్ళు చల్లనవును
నడక నేర్వని నాడు తొలి అడుగే, విజయం
తుదకు చేరిన నాడు ఆఖరి అడుగే, విజయం
నడుమ ఆగిన నాడు, బ్రతుకు మర రణంలో
ఆ ఒక్క వెనకడుగే మరణం
ప్రతీ అడుగూ తొలి అడుగు, ఓటమిని దాటే వేళల్లో
ప్రతీ అడుగూ ఆఖరి అడుగు, గెలుపు వైపు నడిచే దారుల్లో
అద్దెకుండే వాళ్ళే అందరూ, ఓటమి గెలుపు ఇళ్ళల్లో
మనిషికే చీకటి పడితే బెదిరిపోతాడు
బాధ బరువైనది, అందుకే
బ్రతుకు విలువైనది
సుఖం సులువైనది, అందుకే
గెలుపు అరుదైనది
కంటిని మూసే వీలే నిదుర
మరల తెరవలేక పోవడమే వ్యథరా
మింటిని తాకే ఆశే, పదరా.....!
మునుపటినే మొస్తూ పోతే పడిపోతావురా
మన్నులోపడి విత్తు మానవును
గాలిలోపడి మాను మంటవును
మంటలోపడి మట్టి కుండవును
కుండలోపడి నీళ్ళు చల్లనవును
నడక నేర్వని నాడు తొలి అడుగే, విజయం
తుదకు చేరిన నాడు ఆఖరి అడుగే, విజయం
నడుమ ఆగిన నాడు, బ్రతుకు మర రణంలో
ఆ ఒక్క వెనకడుగే మరణం
ప్రతీ అడుగూ తొలి అడుగు, ఓటమిని దాటే వేళల్లో
ప్రతీ అడుగూ ఆఖరి అడుగు, గెలుపు వైపు నడిచే దారుల్లో
అద్దెకుండే వాళ్ళే అందరూ, ఓటమి గెలుపు ఇళ్ళల్లో