పలుకరిస్తే ముత్యాలే రాలిపోవులే
వెంటవస్తే మైలే అంటుకోదులే
చుట్టూవున్న వాళ్లేమి అనుకోరులే
చుట్టాన్నై ఇంటికే రానులేవే
జాబిలై ఉండిపోకే నింగినే నీవక్కడ
చందమామై అందరావే అద్దంలో నేడు ఇక్కడ
మేఘమై సాగిపోకే గగనమంటి రహదారిలో
స్వాతిజల్లులా నన్నుచేరి మురిపిస్తే తప్పుకాదులే
చరణం
వెంటవస్తా నువ్వు ఒప్పుకొంటే
కౌగిలిస్తా నీకు ఇష్టమైతే
పగలు రేయి నీతో ఉంటా.......కలలోనే
గాలినౌతా నీకు చమట పడితే
సేవ చేస్తా నువ్వు అలసిపోతే
నిత్యం నిన్నే అల్లుకుంటా....నీ చీర నేనై
నీ గుండెపై జారిపోనా......ముత్యాల హారాన్నై
నీ కాలిపై ఘల్లుమనన.....మువ్వల పట్టీన్నై
చరణం
పువ్వు పెడతా నువ్వు జడ వేస్తే
లేఖ రాస్తా నీకు ప్రేమ ఉంటే
నీ నుదుటే బొట్టే పెడతా....గుడిలో దేవివైతే
నీ బరువు మోస్తా నువ్వు జారిపడితే
వంపు సొంపు చూస్తా బాపు బొమ్మవైతే
లోగుట్టు బయటికే లాగుతా....మనసునున్న ప్రేమనే
నీ నడుమునే చుట్టిరాన.....వరాల వడ్డాణమై
నీ పెదవిపై ముద్దుకాన ....రంగుల లిప్ స్టిక్ నై