నూటికి లోపే మనిషి జీవితం
కోటిలో ఒకటే ప్రేమ విజయం
తెలియక చేసిన నిన్న ప్రణయం
నేటికి మిగిల్చెను ఒంటరితనం
ఆద్యం ఆమె స్నేహం
మధురం ప్రేమ తీరం
గాయం దాని శేషం
బ్రతుకుకే బరువైన జ్ఞాపకాలు
మనసులో ముసిరిన కారుమేఘాలు
ఉరిమి కురవగా జారెను కంట నీరు
ప్రేమే నిజమని నమ్మితే
నిజమైన ప్రేమకు ఇది పరిపాటే
జాలిలేని జీవితం నీడలో
ప్రాణమే మోయలేని రోజులో
ఆయువే తీరిపోయే వరము చాలు
ప్రేమ గరళానికి ప్రతిరూపమే
మనసుని చంపి మనిషిని విడిచే