Thursday, January 17, 2013

పడుచుతనమా నీవు గడుచుతనమా






పడుచుతనమా నీవు గడుచుతనమా
పల్లెతనమా నీవు పచ్చదనమా
పరువాల నీ పరవళ్ళు, నను చేరితే
పడిలేచే ఈ కడలి వళ్ళు, నువ్వు తాకితే

వెన్నల తెల్లనితనమా వన్నెల నీ నయగారం
పసితనం తెలియనితనమా మనసులో నీ కంగారు
నల్లని కాటుకతనమా కన్నుల నీ సింగారం
పసిడిలో మెరుపుతనమా పెదవిపై నీ దరహాసం

జతపడే ఆశతో నీ వెంటపడుతూ
నీ కంటపడే వేళలో మరి మాటరాదే

వరదలా ఉధృతమా కోపంలో నీ తీరం
సమీరం శ్రావ్యతనమా ప్రేమలో నీ సమీపం
వయసులో కొంటెతనమా కలలో నీ వదనం
మల్లెపూవు పరిమళమా మనసులో నీ ధ్యానం

ఎదురిపడి నువ్వు పలుకరించే వేళలో
కుదుటపడి ఉండలేదు ఈ ఎద సడేమిటో