Friday, November 16, 2012

తొలకరి



నిరాశ నుంచి నిన్ననే వెలికి తీయగా
రేపు ఫై ఆశే చిగురించద
కష్టాల నుంచి కన్నీళ్లనే తుడిచేయగా
కలలు చూపు దారులే కనిపించవా

మబ్బు పట్టిన ఆకాశం

స్వచ్చమై ఉండనే ఉండదు
హరివిల్లు నిండిన ఆ గగనం
ఎంత అందమైన అందనే అందదు

వెళ కాని వేళ స్వాతి జల్లు రాక

రైతు పొట్ట కొడితే తిట్టరా......పసిపాపలైన
వడియాలు పెట్టు వేళ మేఘాన దాగి ఉంటె
ఆ సూరీడయితే ఏంటి....అని ఆడిపోసుకుంటాముగ

వదిలేసి కూర్చుంటే గెడ్డలు మీసాలు పెరిగి పోవులే

వీలు చూసి మొదలెడితే సాగరం తల వంచి దారీయులే

ఉప్పులేని కూర శ్రమతోనే వండి పెట్టిన

ముద్దైన దిగున నేతి చుక్క కూడ వేసినా
పోటి లేని వేళ గెలుపు నీది అయిన
వొడినట్టే మనసు బహుమతి స్వీకరించునా

పరుగెత్తే వయసుంటే పడి లేవడం మాములే

పడి లేవలేని రోజు వరకు ఆగనిది ఈ బ్రతుకు పోరులే