Saturday, November 17, 2012

మహానుభావులు రాతి బొమ్మలు





మహానుభావులు మరల రారు, రాతి బొమ్మలై వీధిన పడ్డ,
గుర్తే రారు, అసలు గుర్తే లేరు!

కర్ర పట్టిన గాంధీ తాత, గులాబీ పెట్టిన నెహ్రు పండిట్

హెయిర్ కట్ ఇందిరమ్మ, విల్లు ఎక్కుపెట్టిన అల్లూరి
ముసలి అమ్మ థేరిస్సా, కోర మీసం భగత్ సింగ్
జై జవాన్ నేతాజీ, వేలెత్తి చూపిన అంబేద్కర్


ఎవరైతేనేఁ, ఏమి సాధిస్తే ఏం?

ఆగి చూసే తీరిక లేదు, గుర్తు పట్టే జ్ఞప్తిక లేదు





వోట్లడిగే మంత్రులకు, నోట్లడిగే బిచ్చగాళ్ళకు
ఎగిరెగిరి అలసిన కాకులకు, చీకటి తప్పుల పసికందులకు
ఈ రాతి బొమ్మలే సాక్షాలు, వాటి మూగ రోధనలే ఆనవాళ్లు

స్వేఛ్చ శాంతి మనకిచ్చి, విలువైన బాటనే చూపిస్తే

ప్రాణం తీసి బొమ్మలు చేసాం, స్వార్ధం చూపిన బాటలు పట్టాం



దుమ్ము ధూళితో ఏకంగా, పగలు రేయి తోడుగా
వొంటరి గా దిక్కులు చూస్తూ, కన్నీళ్ళే రాక గుటకలు మింగుతూ
దీనం గా  విలపిస్తున్న, ఆ మట్టి బొమ్మల ధ్యాసే మరిచాం
మళ్లీ మళ్లీ రాలేని మహానుభావులు మన్నించండి