నింగిన మెరిసే జాబిలిని నీటిన విరిసిన తామరని
కలిపే కావ్యం ఈ కవిత
వెన్నలలో ప్రణయ గీతాన్ని వేకువలో సుప్రభాతాన్ని
కూర్చే రాగం ఈ కవిత
కదలక నిలిచిన శిల్పాన్ని చూసి కదిలిన మది చెప్పే
పదజాలం ఈ కవిత
కవ్వించే కోమలి సొగసుని చూసి కలవర పడిన
మది తలపుల వెల్లువ ఈ కవిత
మింటినంటే ఆశల నడుమ సగటు మనిషి గమ్యాన్న
తెలిపే దిక్శూచి ఈ కవిత
రాలిపోయే పువ్వుకు రాగాలు ముడివేసిన
సినిమా పాట సాహిత్యం ఈ కవిత
స్వేఛ్చగ ఎగిరే పావురాన్ని స్వేచ్చనిచ్చిన గాంధిజీని
కలిపే భావం ఈ కవిత
సిరివెన్నల వేళ మది మబ్బుల మాటున
మెరిసే మెరుపుకల ఈ కవిత
ఎదిగిన వయసున పసితనాన్ని గుర్తు తెచ్చే
తీపి జ్ఞాపకాల జావళి ఈ కవిత
నగ్నమై నిలిచిన కన్యను కన్నతల్లితో పోల్చే
కవి హృదయం ఈ కవిత
స్త్రీ పురుషుల సంగమం సృష్టి యజ్ఞానికే మూలం
అని తెలిపే కవిలో రక్తం ఈ కవిత
అందుకే కాదేది కవిత కనర్హం!