Tuesday, November 20, 2012

రేసులో పడ్డ O.C కొడుకా


రేసులో పడ్డ O.C కొడుకా , ఓపెన్ కేటగరీలో నువ్వు పోటి పడగా 

పెద్ద చదువుకు పెద్ద కులమే అడ్డు, చిన్న కొలువుకు మారని ట్రెండు 
తాతలు నాకిన నేతి కబుర్లు, పూట కూటికే నిన్ను దూరం చేస్తే 
వచ్చే కోపం తిక్క తిక్కగా, బేవార్స్ బ్యాచ్చంటు నిన్ను హేళన చేస్తే 

కాపు, కమ్మ, రెడ్డి కులమేదైనా, అగ్రవర్ణమే నీకు అడ్డుగా నిలిచే 
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య పేరేదైనా, O.C  అంటూ ఒక్క రాటకు కట్టే 
తాతలు, తండ్రుల ఆస్తులన్నీ, తరతరాలుగా తరించి పోయినా 
కులం, మతం, జాతి బేధాలన్నీ, విప్లవాగ్నిలో దహించికు పోతున్నా 

నిరుద్యోగమే అంటురోగమై, అగ్రవర్ణమే తగలడుతుంటే 
నీ ఊసే మరచిన A.C మంత్రులు, కులాల వారీ పోటి చేస్తే 
అడుక్కోలేని ఆత్మగౌరవం, ఆత్మహత్యకే నిన్ను ప్రేరేపిస్తే 
చరిత్ర మరువని రాజ్యాంగం, O.C తాడుతో నీకే ఉరినే వేస్తే 

వేగం పెంచి నువ్వు పరిగెడుతున్నా, రిజర్వేషనే  నిన్ను వేనకేస్తుంటే 
పొరపాటున నీకు పెళ్ళే చేస్తే , నీ కోరిక మళ్లీ O.C కొడుకై పుట్టే 
ఒక్క రోజుతో నీ ఏజ్ బారయినా, ఒక్క మార్కుతో నీ జాబే జారిపోయినా 
మారిపోదులే నీ పేరు ముందు ఇంటిపేరు, ఊడిపోదులే నీ పేరు వెనుక 
దొర, చౌదరి, నాయుడు, రాయుడు, రెడ్డి, రాజు, శాస్త్రి....కులం పేరు