Saturday, December 8, 2012

He Is






మంచుకొండలా మనసున్నోడు
మండుటెండలా పొగరున్నోడు
మంచి ముత్యం వీడే  వీడేరో


ఋషులకు శిష్యుడు వీడు
పురుషులలో పుణ్యపురుషుడు
అసురులకు మోక్షం వీడేరో

వెటకారమైన, చమత్కారమైన జర జాగ్రత్తరో
కనికరం లేని పంచోస్తాది అది వాడి కేరెక్టర్రో


సలక్షణాల సొగసున్నోడు
సయ్యాటకీ సరిజోడీ వీడు
24 క్యారెట్ వీడే వీడేరో


సరిగమలకే నాట్యం వీడు 
అధరములకే మధురము వీడు 
కన్నెలకు కావలిసినవాడేరో

Dare To Do నమ్మిన వాడు
Down to earth person వీడు
వెన్నులో చలి లేని వాడేరో 

యుగానికొక్కడు యుద్ధభూమిలో వీరుడు వీడెరో
ప్రణయమైన పరిణయమైన సరియైన సరసుడురో

నీతికి Native వీడు
బూతులకు భూతం వీడు
బ్రతుకులో గెలుపే వీడేరో

అచ్చులలో అక్షరమే వీడు
హల్లులలో పొల్లే వీడు
అచ్చతెలుగు అబ్బాయే వీడేరో

కన్నె కలలకు నాయకుడు
కళలకు కధానాయకుడు
లౌక్యమే ఐక్యమైన చాణక్యుడురో

మన మధ్యవున్న common man క్యారెక్టర్ వీడేరో
మంచి లక్షణాలు మెండుగ వున్న మంచి అబ్బాయిరో