సినిమా సినిమా సినిమా
నువ్వు చూసేది నేను తీసేది
తప్పు ఒప్పుల తేడా చూపాలి
తప్పులు చెప్పే ధైర్యం కావాలి
వాటిని ఒప్పించే నేర్పు కావాలి
మనోభావాలకు లోబడిపోవాలి
కాన్ట్రో వెర్శీ లో కొట్టుకుపోవాలి
సమాజం తో సర్దుకుపోవాలి
సర్దుకు పోతూ కొత్తగా తీయాలి
నీకు తెలియని నీతుందా
నే కొత్తగా చెప్పడానికి
నీకు రాని బూతుందా
నే చెప్తే ఛీ అనడానికి
విప్పకుండా చెప్పేదేట్టా
తప్పేదో ఒప్పేదో
ముడిపెట్టకుండా చూపేదేట్టా
భాషేదో యాసేదో
ఎనిమిది కోట్లకు నచ్చుద్దో లేదో
నలుగురు కుర్చుని డిసైడ్ చేస్తే
నలభై కోట్ల సినిమా బడ్జెట్
నలుగురు మధ్య ఫుట్ బాలే చేస్తే
ఎంగిలి ఆకులు నాకే వాళ్ళు
కొత్త బొమ్మలు కొత్త సి.డి చేస్తే
బాగా చదివిన బిటెక్ బాబులు
టోరంట్ సైటులో అప్ లోడ్ చేస్తే
కొత్తగా నేను తీసేదేట్టా
కుళ్ళు కంపును చూపేదెట్టా
ప్రేమదోమ కథలేకాని
కొత్తకథలు చేతకావని
నడుము వంపుల నాట్యమేకాని
నలుగురు మెచ్చే కథలేరావని
కుసేకూతల నోటిమూత కోసం
కొత్తగా మేము సినిమా తీస్తే
రాజకీయమో, కులం గోత్రమో
మనోభావామో, మతం మోహమో
సినిమా గుడ్డలు చించేస్తారు
కథల రీళ్ళనే కాల్చేస్తారు
మా ఇళ్ళపైనే రాళ్లేస్తారు
వాల్ పోస్టర్ పై పేడేస్తారు
సినిమా చూసే సగటు వాడికి
నచ్చకపోతే చూడక పోనీ
నచ్చుద్దో లేదో చెప్పడానికి
నువ్వెవడివిరా అని ప్రశ్నించలేని
ఫిల్మ్ నగర్ ప్రాంతం వాడిని
కళాకారుల కులం వాడిని
సినిమా అనే మతం వాడిని
సినిమా కోసం చచ్చే వాడిని