ప్రేమంటే పాముకాదు కన్నా
ఇది స్వచ్చమైన ఆవుపాల వెన్న
మొక్కకున్న ముల్లు కాదురన్న
ఆ ముల్లుపై పువ్వురా చిన్నా
మీ నాన్నకైనా తప్పలేదు మొన్న
నీలాగే అనుకున్న మొన్న
ఈనాడు మునిగి తేలుతున్న
ప్రేమలే మానేస్తే లైఫే బోరు!
ఒక్కసారి ప్రేమించి ఆపైన నువ్వుచుస్తే
టాక్ లు వాక్ లు మారెను తీరు
ధైర్యం చేసి మాట్లాడి చూడు
ఆపైనా స్నేహమే చేసి చూడు
మనసుకే మనసు ఇచ్చి చూడు
సినిమాలు షికార్లు చేసిచూడు
రెండు స్ట్రాలు పెట్టి డ్రింకు తాగిచూడు
రింగు రోడ్డులన్నీ తిరిగిచూడు
లోకంలో తీయనిది ప్రేమేనురా
లోకమంతా వద్దన్నా ఆగదురా
మల్లెపూవు కన్నా తెల్లనిదిరా
మండుటెండకూడ వెన్నెలవుతుందిరా