Sunday, January 27, 2013

Life is a compromise

ప్రతీక్షణం క్షణాలతో
మరుక్షణం గతాలతో
బ్రతుకులో గతుకులతో
అతుకుల మనసులతో
జీవితం ఒక రాజీ
నియంత్రించలేము ఎదురయ్యే ఏ మజిలీ

కురిసే వానకు తడిసిన వేళ
పూసే పూవులు వాడిన వేళ
వేడుకైన రోజులు కరువైన వేళ
మనసైన మనుషులు చితియైన వేళ
కనులే కడలైనా
కలలే అలలైనా
ఆ అలజడులే కన్నీరైనా
బ్రతకడమే రాజీ
మెతుకు ముట్టి, ముందుకు నడిపే సూచి

వాకిటలో చీకటిలే ముసిరేసే చోట
రేపటిలో ఈ పుటలే ఉదయించే చోట
నాటికలా జీవన్నాటకమే ప్రసరించే చోట
శవపేటికలా ఈ దినమే అగుపించే చోట
గతమెంతో ఘనమైనా
భవితెంతో ప్రియమైనా
నడుమన అంతా రణమైనా
నడవడమే రాజీ
సాగక ఆగినా, ఆగదు బ్రతుకు పేచీ