Thursday, January 3, 2013

The Night


సూర్యుడు వెలుగుకి నీడయ్యేది
జాబిలి వెలుగు వెన్నెలయ్యేది
దీపాల వెలుగుకి పండగయ్యేది

నేడు రేపులకు వంతెనయ్యేది
కదిలే కాలానికి మలుపయ్యేది
కొత్త సంవత్సరానికి వేడుకయ్యేది

నిదురన మనిషి ఒంటరయ్యేది
మనసున కోరిక తుంటరయ్యేది
కన్నుల కలలకు వేదికయ్యేది

ఈ రేతిరి లేతే చీకటేది
చీకటి లేతే వెలుగుకి విలువేది
వెలుగు నీడల జీవితానికి సేదతీరే చోటేది