నడిచితే జీవితం
గెలిచితే విజయం
గడిచితే జ్ఞాపకం
ఎదకు అనుభవమే పాఠం
బ్రతుకు బడిలో అది వేదం
బ్రతికేందుకే బ్రతుకంటే, బ్రతికుంటే చాలంటావు
గెలిచేందుకే బ్రతుకంటే, బ్రతుకునే గెలిచేస్తావు
ఓడడం తప్పుకాదు
మెళకువలు నేర్వడం నేర్చితే
ఏడవడం ఒప్పుకాదు
నినుమించిన అర్హత గెలిచితే
కలలంటే కల్లలంటే, కన్నీళ్ళే మిగులుతాయి
కలలనే లక్ష్యమంటే, ప్రయత్నాలే సాగుతాయి
గెలుపొకటే తుదికాదు
మనిషిగా బ్రతకడం మొదలెడితే
ఓడినోడు ఒంటరికాడు
గెలుపునే పంచడం అలవాటైతే