Monday, May 6, 2013

Jindagi


జిందగీ.....

జననం మరణం మధ్యలో
ఓటమి గెలుపు మధ్యలో
పడడం లేవడం మధ్యలో
పదుగురి మధ్యలో
జిందగీ.....
కష్టం సుఖం మధ్యలో
ద్వేషం ప్రేమ మధ్యలో
నిశ్వాస శ్వాస మధ్యలో
నలుదిక్కుల మధ్యలో

రేపటి రోజుకి భరోసా లేకున్నా
అయిదు వేళ్ళు నోటిలోకి పోకున్నా
ఆఖరి రూపాయి జేబులోంచి పోతున్నా
వాలుకు జారే ప్రవాహంలో సవాలులాంటి ఎదురీతే.... 
జిందగీ... మిస్సైతే నా మిలేగి

ఫ్రీడమ్ ఈజీగా దొరకలేదురా
స్టార్ డమ్ లేజీకి దక్కబోదురా
లైఫ్ టైమ్ పోరాటం ఆపబోకురా
వెల్ కమ్ గెలుపుకు నువ్వే చెప్పుకోర
ఓదార్పు నువ్వు కోరితే, అది ఆర్పెను నీలో కసిని
నిస్సత్తువ నిన్ను చేరితే, అది చేర్చును ఓటమి ఒడ్డుని
విన్నర్ గా మిస్ అయినా, రన్నర్ గా మిగిలేవు
రన్నింగే ఆపేస్తే, లైఫ్ టర్నింగ్ లో డ్రాప్ అయ్యేవు
జిందగీ... మిస్సైతే నా మిలేగి

నిరీక్షణలో నిన్ను నువ్వు తెలుసుకోరా
లక్ష్యంపై నీ దృష్టిని కక్ష్యలోనే ఉంచుకోరా
ప్రతి నిమిషం శిక్షణలోనే  రాటుతేలరా
యుద్ధంలో తలదించక పోరాడి చూడరా
లక్ అంటూ లెక్కలేయకు, నీ లాజిక్ కి లైఫ్ దొరకదు
మొక్కంటూ గుడి మెట్లెక్కకు, ఏ మేజిక్ కి గెలుపు అందదు
ఫెయిల్యూర్ ఫైర్ అయినా, ఎక్స్ పీరియెన్స్ ప్లస్ అయ్యేను
ప్రయత్నించడం ఆపేస్తే, ఇక పరమపదించడం మేలయ్యేను
జిందగీ... మిస్సైతే నా మిలేగి