రెండు మేఘాల కలయిక మెరుపుకు
ప్రసవ వేదనల ఉరుముల అరుపుకు
వర్షించిన జన్మ
బుడి బుడి అడుగుల కాళ్ళ అడుగులు
కాలువలుగా మారి
హృదయ శిఖరాల అంచున ఆశలు
జలపాతాలై జారి
యుక్తవయసున సొగసు వరదలు
యేరులై పారి
నడివయస్సుకు నలుగురితో కలసి
నదిగా సాగే
కోపం ద్వేషం విసర్జించిన మలమును కడుగుతూ
స్నేహం ప్రేమ పుణ్యక్షేత్రాలలో తీర్ధంగా మారుతూ
తోడబుట్టిన తోటినదుల సాక్షిగా
ఉపనదితో పరిణయమాడి
బ్రతుకుతెరువుకై ఊరూరా పారి
బంధువుల ఇళ్ళలో బావిలో ఊరి
సమాజం కోసం ఆనకట్టన ఆగి
ప్రయోజనం కోసం కొత్తబాటలో సాగి
ఆశల తీరం అటు ఇటు మథ్యన
నది మది మథ్యన ఆవేదన సుడులు
బాధల బరువుకు మునిగిన రాళ్ళపై
వేడుక వేళలో పైకి తేలే చిరునవ్వుల నురగలు
సాయంకోరే ప్రతీ నావను నావాళ్ళను మోస్తూ
సాగేదారిలో బ్రతుకును సాగుచేస్తూ
మనసు విరిగితే ఉధృతమై పొంగుతూ
వయసు నిండితే సంద్రంలో సంగమిస్తూ
బ్రతుకు తీపిని నిన్నటి నదిలో వదిలి
వృద్ధాప్యంలో ఉప్పునీటిని చేరే
కలల అలలు ఎంత ఎగసిపడినా
తను కన్నవాళ్ళ కౌగిలి తీరం చేరలేక
పుట్టిన ఇంటిని చేరే ప్రవాహవేగం లేక
తోడబుట్టిన తోటినదుల కోసం ఎదురుచూస్తూ
చితిమంటల వేడికి చివరకు ఆవిరిగా మారే
ఇది జీవన ప్రవాహం
జల జీవన ప్రవాహం
జన జీవన ప్రవాహం
ప్రసవ వేదనల ఉరుముల అరుపుకు
వర్షించిన జన్మ
బుడి బుడి అడుగుల కాళ్ళ అడుగులు
కాలువలుగా మారి
హృదయ శిఖరాల అంచున ఆశలు
జలపాతాలై జారి
యుక్తవయసున సొగసు వరదలు
యేరులై పారి
నడివయస్సుకు నలుగురితో కలసి
నదిగా సాగే
కోపం ద్వేషం విసర్జించిన మలమును కడుగుతూ
స్నేహం ప్రేమ పుణ్యక్షేత్రాలలో తీర్ధంగా మారుతూ
తోడబుట్టిన తోటినదుల సాక్షిగా
ఉపనదితో పరిణయమాడి
బ్రతుకుతెరువుకై ఊరూరా పారి
బంధువుల ఇళ్ళలో బావిలో ఊరి
సమాజం కోసం ఆనకట్టన ఆగి
ప్రయోజనం కోసం కొత్తబాటలో సాగి
ఆశల తీరం అటు ఇటు మథ్యన
నది మది మథ్యన ఆవేదన సుడులు
బాధల బరువుకు మునిగిన రాళ్ళపై
వేడుక వేళలో పైకి తేలే చిరునవ్వుల నురగలు
సాయంకోరే ప్రతీ నావను నావాళ్ళను మోస్తూ
సాగేదారిలో బ్రతుకును సాగుచేస్తూ
మనసు విరిగితే ఉధృతమై పొంగుతూ
వయసు నిండితే సంద్రంలో సంగమిస్తూ
బ్రతుకు తీపిని నిన్నటి నదిలో వదిలి
వృద్ధాప్యంలో ఉప్పునీటిని చేరే
కలల అలలు ఎంత ఎగసిపడినా
తను కన్నవాళ్ళ కౌగిలి తీరం చేరలేక
పుట్టిన ఇంటిని చేరే ప్రవాహవేగం లేక
తోడబుట్టిన తోటినదుల కోసం ఎదురుచూస్తూ
చితిమంటల వేడికి చివరకు ఆవిరిగా మారే
ఇది జీవన ప్రవాహం
జల జీవన ప్రవాహం
జన జీవన ప్రవాహం