Tuesday, January 22, 2013

గుండె ఘల్లుమంటుందే దిల్ జిల్లుమంటుందే


గుండె ఘల్లుమంటుందే, దిల్ జిల్లుమంటుందే
మనసు మొగ్గలేస్తుందే, నువ్వు ముందరుంటే
కన్ను గీటుతుంటుందే, చేయి తాకుతుంటుందే
జెబ్బ రాసుకుంటుందే, నువ్వు పక్కనుంటే

ఇందరిలో నువ్వు సుందరివా ఏమో
తొందరలో తొంగి చూసేయనా
అందరిలో నువ్వు ఒంటరిగా వుంటే
చెక్కిలిపై ఎరుపు కొరికేయనా

నింగి వీడి చినుకే నేలపైన నదియై
కడలి చేరే వరదై పరుగెత్తదా
గూడువీడి ఈ చిలకే వయసులోన సొగసై
నన్ను చేరే పరువంగా దరిచేరదా

రేతిరిలో కల వేకువలో ఇలా నా ఎదుటే నిలుచున్నదా
ఊహలలో శిల ఊయలలో ఇలా నాతోనే ఊగుతున్నదా

ఎదను దాటి నీ సిగ్గే బుగ్గ చేరి నిగ్గై
పెదవిపైన విరుపై ఉసిగొల్పదా
నడుము చేరి నా చెయ్యే సొగసు కోసం వెదికే
చేతికందే వేళ గుండె గెంతేయదా

ఊపిరిలో ఊహ హృదయంలో చేరి నీ పేరే వ్రాస్తున్నదా 
లాహిరిలో లయ మనసంతా నిండి నీ కోసం విహరిస్తున్నదా