Wednesday, January 23, 2013

మనసుపడితే...



మనసుపడితే మనిషి ఆశ
మథనపడడమే మిగులును తెలుసా
మనసులో ఒకరిని నిలిపితే
మనసు విలువ ఆ ఒకరికి తెలుసా
బ్రతకడం నేర్చితే మనసునే చంపుకో
మనసుతో బ్రతికితే నవ్వడం మరచిపో

ఆశతో మొదలైన ప్రయాణం
శ్వాసతో మనిషిని నిలిపి
నిరాశలో మనసుని తోసే
ప్రేమనేది గగన ప్రయాణం
తొలిసంధ్యకు హృదయమే ఉదయం
మలిసంధ్యకు మనసనేది మరణం

చేరువలో విలువ తెలియదు
దూరమయితే మరల దొరకదు
తీరంలో చొరవ చూపదు
నడిసంద్రంలో దిక్కు తోచదు

సొగసు రేపే వింత మోహం
మనసుపై పొగమంచు ధూపం
కోరిక తీరితే, మనసు కాటికి చేరే
వయసు కోసం జంట ప్రయాణం
మనసు చేసే అగ్నిప్రవేశం
మనిషికి అది చితిమంటల దీపం

మెతుకులతో కడుపు నింపినా 
గతుకులలో మనసు నడుచునా
మనసు తీరు కన్నులు తడిపినా 
మనిషికి వేరు, మనసు కాకపోవునా